Maharashtra: ఆందోళన వద్దు, మన బంధం చిరకాలం ఉంటుంది... ఎన్సీపీ ఎమ్మెల్యేలకు శివసేన అధినేత భరోసా

  • ముంబయి రెనాసెన్స్ హోటల్ లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలతో సమావేశమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
  • ఈ సమావేశానికి ఉద్ధవ్ థాకరే కూడా హాజరు
మహారాష్ట్రలో అత్యంత కీలకమైన బలనిరూపణ ఘట్టం ముంగిట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన సంగతి తెలిసిందే. ముంబయిలోని రెనాసెన్స్ హోటల్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆ పార్టీ కీలకనేత సంజయ్ రౌత్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, శివసేన-ఎన్సీపీ బంధం చిరకాలం ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతిమ విజయం తమదేనని వ్యాఖ్యానించారు. అటు, బీజేపీ శాసనసభాపక్షం కూడా ముంబయిలో సమావేశమైంది. అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా హాజరయ్యారు.
Maharashtra
Shivsena
NCP
BJP

More Telugu News