Andhra Pradesh: ఏపీ-తమిళనాడు సరిహద్దులో నిలిచిపోయిన పినాకిని ఎక్స్ ప్రెస్

  • రైలుకు సాంకేతిక సమస్యలు
  • 2 గంటలకు పైగా నిలిచిపోయిన వైనం
  • చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న పినాకిని
చెన్నై నుంచి విజయవాడ వస్తున్న పినాకిని ఎక్స్ ప్రెస్ రైలు మార్గమధ్యంలో నిలిచిపోయింది. ఏపీ-తమిళనాడు సరిహద్దులో కవరపేట వద్ద ఈ రైలు సాంకేతిక సమస్యలతో నిలిచింది. దాదాపు రెండు గంటల నుంచి రైలు కవరపేట వద్దే నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. సాంకేతిక సమస్యలను చక్కదిద్దేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh
Tamilnadu
Chennai
Vijayawada
Pinakini Express

More Telugu News