అకౌంట్లో జగన్ గారి చిల్లర పడితే చాలు పేటీఎం బ్యాచ్ రెచ్చిపోతోంది: నారా లోకేశ్

  • పేటీఎం బ్యాచ్ ఆవేశం చూస్తుంటే నవ్వొస్తోందన్న లోకేశ్
  • పాత ఫొటోలు పోస్టు చేసి కొత్త కథ అల్లారంటూ విమర్శలు
  • ఇంగితజ్ఞానం లేదంటూ వ్యాఖ్యలు
వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆవేశం చూస్తుంటే నవ్వొస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అకౌంట్లో జగన్ గారి చిల్లర పడితే చాలు ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి రెచ్చిపోతున్నారని విమర్శించారు. సీఎం రమేశ్ గారి కొడుకు పెళ్లికి లోకేశ్ దుబాయ్ వెళ్లాడంటూ ఎప్పుడో 2015లో అమెరికా వెళ్లినప్పటి ఫొటోలు పోస్టు చేసి కొత్త కథ అల్లారని మండిపడ్డారు. అంతేకాకుండా, ఈ విధమైన పోస్టులు చేసేవారిపై లోకేశ్ జాలి ప్రదర్శించారు. "సోషల్ మీడియాలో మీరు ఒక పోస్టు చేస్తే ఇంకా ఐదు రూపాయలే ఇస్తున్నారట కదా! కాస్త ఎక్కువ అడగండి స్వామీ... జే ట్యాక్స్ తో కోట్లు వసూలు చేసుకుంటున్నారు... మీకు ఇంకా ఐదు రూపాయలే అకౌంట్లో వేస్తే ఎలా!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Andhra Pradesh
YSRCP
PAYTM

More Telugu News