KCR: కేసీఆర్ కు విలాస జీవితమే ముఖ్యం: రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో 50వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
  • కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
  • పేదవాళ్ల ఎర్రబస్సుతో కేసీఆర్ కు అవసరంలేదని వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కు విలాసవంతమైన జీవితమే ముఖ్యమని అన్నారు. పేదవాళ్లు ఎక్కే ఎర్రబస్సుతో ఆయనకు పనిలేదని విమర్శించారు. తెలంగాణ సెక్రటేరియట్ కట్టేందుకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానన్న కేసీఆర్ వద్ద ఆర్టీసీకి ఇచ్చేందుకు రూ.49 వేల కోట్లు లేవా? అని నిలదీశారు. మూడు వేల కోట్ల అప్పులున్న ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటున్నారని, మరి రూ.30 వేల కోట్ల అప్పున్న మెట్రో రైల్ ను ఏంచేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 50వ రోజుకు చేరిన సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
KCR
Revanth Reddy
Telangana
TSRTC
Congress
TRS

More Telugu News