Spicejet: తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం

  • పేలిపోయిన టైరు
  • ల్యాండింగ్ చేస్తుండగా ఘటన
  • చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్
స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతి చేరుకున్న ఆ విమానం టైరు పేలిపోయింది. విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా టైరు పేలినట్టు గుర్తించిన పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ఇక్కడి రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి వెంటనే మరమ్మతులు నిర్వహించారు.
Spicejet
Tirupati
Andhra Pradesh
Hyderabad
Mumbai

More Telugu News