అయోధ్యలో గొప్ప ఆలయం నిర్మించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది: సచిన్ పైలెట్
- అయోధ్య అంశంపై రాజకీయాలు మానుకోవాలని హితవు
- సుప్రీం తీర్పు అందరికీ ఆమోదయోగ్యమన్న సచిన్ పైలట్
- తీర్పు సజావుగా అమలు జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
ఆ తీర్పు తమకు పూర్తిగా హర్షణీయమేనని, ఆ నిర్ణయం సజావుగా అమలు జరగాలన్నదే తమ అభిమతం అని, దీనిపై రాజకీయాలు కట్టిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ముఖ్యంగా, 30 ఏళ్లుగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నవారు ఇకనైనా పరిస్థితి అర్థం చేసుకుని మసలుకోవాలని హితవు పలికారు. ఈ వివాదాన్ని మళ్లీ మళ్లీ తిరగదోడడం వల్ల ఏ ఒక్కరూ రాజకీయ లబ్ది పొందే అవకాశాల్లేవని గుర్తెరగాలని అన్నారు.