చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతగా దిగజారిపోయారో చెప్పడానికి ఇదిగో నిదర్శనం: వైసీపీ
- గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులంటూ కథనాలు
- అసలు విగ్రహం ఇదిగోనంటూ ట్విట్టర్ లో వైసీపీ పోస్టు
- విపక్షనేతల వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పండంటూ ట్వీట్
అంతేకాదు, గాంధీ విగ్రహం వాస్తవ పరిస్థితుల్లో ఎలా వర్ణరహితంగా ఉందో చూడండి ఇదే రియల్ అంటూ రంగుల్లేని గాంధీ విగ్రహం ఫొటోను కూడా చంద్రబాబు, పవన్ ట్వీట్ల పక్కనే జోడించింది. ఇప్పుడు చెప్పండి, ఈ విపక్ష భాగస్వాముల వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే నిర్ణయించండి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో నిలదీసింది. ఆయా ఫొటోల్లో అస్పష్టత, రాతలు ఒకేలా ఉండకపోవడం పవన్, చంద్రబాబుల కుట్రకోణాన్ని వెల్లడిస్తోందని వైసీపీ ఆరోపించింది.