YSRCP: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతగా దిగజారిపోయారో చెప్పడానికి ఇదిగో నిదర్శనం: వైసీపీ

  • గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులంటూ కథనాలు
  • అసలు విగ్రహం ఇదిగోనంటూ ట్విట్టర్ లో వైసీపీ పోస్టు
  • విపక్షనేతల వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పండంటూ ట్వీట్
విజయనగరం జిల్లాలో గాంధీ విగ్రహానికి  కూడా వైసీపీ రంగులు వేశారంటే, మున్ముందు ఇంకా వేటికి రంగులు వేస్తారోనని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎంత దిగజారిపోయారో చెప్పడానికి ఈ గాంధీ విగ్రహమే నిదర్శనం అని సోషల్ మీడియాలో సోదాహరణంగా పోస్టు చేసింది. టీడీపీ ఫొటోషాప్ లో గాంధీ విగ్రహం ఇలా ఉంది, జనసేన ఫొటోషాప్ చేసిన దాంట్లో గాంధీ విగ్రహం పరిస్థితి ఇదీ అంటే వైసీపీ ట్విట్టర్ లో వివరించింది.

అంతేకాదు, గాంధీ విగ్రహం వాస్తవ పరిస్థితుల్లో ఎలా వర్ణరహితంగా ఉందో చూడండి ఇదే రియల్ అంటూ రంగుల్లేని గాంధీ విగ్రహం ఫొటోను కూడా చంద్రబాబు, పవన్ ట్వీట్ల పక్కనే జోడించింది. ఇప్పుడు చెప్పండి, ఈ విపక్ష భాగస్వాముల వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే నిర్ణయించండి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో నిలదీసింది. ఆయా ఫొటోల్లో అస్పష్టత, రాతలు ఒకేలా ఉండకపోవడం పవన్, చంద్రబాబుల కుట్రకోణాన్ని వెల్లడిస్తోందని వైసీపీ ఆరోపించింది.
YSRCP
Chandrababu
Pawan Kalyan
Gandhi
Andhra Pradesh

More Telugu News