suicide: గాజువాకలో విషాదం.. గదిలో విగతజీవులుగా ప్రేమ జంట!

  • ప్రేమించుకొని ఒంగోలుకు వెళ్లిపోయిన ప్రేమజంట
  • రెండు నెలల క్రితం తిరిగి విశాఖకు 
  • ఉరి వేసుకొని ఆత్మహత్య
ఆ యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. జీవితాంతం కలిసి బతకాలని అనుకున్నారు. పెద్దలను ఎదిరించారు.. ఇటీవలే విశాఖ జిల్లా గాజువాకలోని కంఠయ్యనగర్ లో కాపురం పెట్టారు. అయితే, ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం వారిద్దరూ తాము ఉంటోన్న గదిలోనే విగతజీవులుగా కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆటోనగర్ లోని ఓ ప్రైవేటు ల్యాబ్ లో పనిచేసే నరేంద్రకుమార్ (22).. డిల్లేశ్వరి(19)ని ప్రేమించి, కొన్ని నెలల క్రితం ఒంగోలుకు తీసుకెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో రెండు నెలల క్రితం వారిద్దరు కంఠయ్యనగర్ కు వచ్చారు. ఈ రోజు తెల్లవారు జామ నుంచి వారు ఇంటి తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులు తలుపులు తెరిచి చూడగా వారిద్దరూ ఉరివేసుకుని ఉండడాన్ని గమనించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
suicide
Vizag
Crime News

More Telugu News