Hyderabad: ప్రేమ విఫలమై.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి రోడ్డుపై హల్ చల్!

  • బంజారా హిల్స్ లో జనాలపై రాళ్లతో దాడికి యత్నం
  • తాళ్లతో కట్టేసి ఆటోలో స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజుగా గుర్తింపు
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు నంబరు 3లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు, పాదచారులపై రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు.

అయితే, పోలీసులపై కూడా ఆ వ్యక్తి దాడికి దిగాడు. ఆ వ్యక్తిని పోలీసులు చివరకు తాళ్లతో కట్టేసి, ఆటోలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడు తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజు అని పోలీసులు గుర్తించారు. ప్రేమ విఫలమై కొంత కాలంగా అతడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్నారు.
Hyderabad
Crime News

More Telugu News