హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. మైండ్‌స్పేస్ వరకు మెట్రో
- ఈ నెల 29 నుంచి అందుబాటులోకి మైండ్‌స్పేస్ జంక్షన్
- ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ
- కారిడార్-3లో 28 కిలోమీటర్ల దూరం వరకు మెట్రో సేవలు
ప్రస్తుతం హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ ఉద్యోగులు షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు మైండ్‌స్పేస్ జంక్షన్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు మైండ్‌స్పేస్ స్టేషన్ వరకు రైలును ప్రారంభిస్తారు.