వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎంపిక... కొత్త ముఖాల్లేవ్!
- కోల్ కతాలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ
- డిసెంబరు 6 నుంచి భారత్ లో విండీస్ పర్యటన
- 3 టి20లు, 3 వన్డేలు ఆడనున్న కరీబియన్లు
బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ లో ఆడిన హార్డ్ హిట్టర్ శివం దూబేకు మరో అవకాశం ఇచ్చారు. రెండు ఫార్మాట్లలోనూ కోహ్లీనే కెప్టెన్. అంతేకాదు, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై సెలెక్టర్లు మరోమారు నమ్మకం ఉంచారు. అతడే తమ ప్రధాన వికెట్ కీపర్ అని వెల్లడిస్తూ రెండు ఫార్మాట్లకూ ఎంపిక చేశారు. డిసెంబరు 6 నుంచి భారత్ లో విండీస్ పర్యటన షురూ కానుంది. ఈ టూర్ లో భాగంగా 3 టి20 మ్యాచ్ లు, 3 వన్డేలు జరగనున్నాయి.