Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికాన్ని పెంచుకుంటూ వెళుతున్న నయనతార

  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్ 
  •  పాత్రలో ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత 
  •  కథకి .. తన పాత్రకి ప్రాధాన్యతనిచ్చే నయన్ 
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఒక వైపున స్టార్ హీరోలతో నటిస్తూనే, మరో వైపున వర్ధమాన హీరోల జోడీగా కనిపించడానికి వెనుకాడకపోవడం నయనతార ప్రత్యేకత. ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో కథాభారాన్ని మొత్తం తానే మోయగల ధైర్యం ఆమె సొంతం. ఏ పాత్రను చేసినా అందులో ఆమె లీనమైపోతుంది .. ఆ పాత్రపై తనదైన ముద్రవేస్తుంది.

ఈ కారణంగానే రోజురోజుకి ఆమె క్రేజ్ పెరిగిపోతోంది .. దానితో పాటే ఆమె తన పారితోషికాన్ని పెంచేస్తోంది. కొంతకాలం క్రితం నయనతార తన పారితోషికంగా 4 కోట్లు తీసుకుంటే, దక్షిణాదికి చెందిన మిగతా కథానాయికలు ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవల కథ .. తన పాత్రకిగల ప్రాముఖ్యతను బట్టి ఆమె 7 నుంచి 8 కోట్లు అడుగుతోందట. నయనతారకి గల క్రేజ్ కారణంగా ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
Nayanatara

More Telugu News