రేణూ మోండల్ 'ఓవర్ మేకప్' వేసుకుందంటూ ఫొటోలు వైరల్.. వివరణ ఇచ్చిన మేకప్ ఆర్టిస్ట్
- రేణూ మోండల్ కు సంబంధించి ఎడిట్ చేసిన ఫొటోలు వచ్చాయి
- అవి చాలా మంది జోకులు వేసుకున్నారు
- అసలుకు, నకిలీకి ఉన్న తేడా తెలుసుకోవాలి
కొంత మంది ఆ ఫొటోలు చూసి తెగ నవ్వుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు, చేస్తోన్న వ్యాఖ్యలు ఎదుటి వారి మనోభావాలను గాయపరుస్తాయని పేర్కొన్నారు. అందుకే అసలుకు, నకిలీకి ఉన్న తేడా తెలుసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు మేకప్ వేసినప్పుడు తీసిన ఒరిజినల్ ఫొటోను సంధ్య పోస్ట్ చేశారు.కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి రేణూ మోండల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఓవర్ మేకప్ వేసుకుందంటూ ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లోని రణఘాట్ రైల్వే స్టేషన్ లో 'ఏక్ ప్యార్ కా నగ్మా హై' అనే పాట పాడగా.... ఆమె స్వరాన్ని విన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఆమె పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.