అదే సెంటిమెంటును ఫాలో అవుతున్న మెగా హీరో
- 'చిత్రలహరి'తో హిట్ కొట్టిన తేజు
- 'ప్రతిరోజూ పండగే'తో ప్రేక్షకుల ముందుకు
- కంటిన్యూ చేస్తున్న సెంటిమెంట్
తాజాగా ఆయన చేస్తున్న 'ప్రతిరోజూ పండగే' సినిమాకి కూడా టైటిల్స్ లో తన పేరును సాయితేజ్ అనే వేసుకుంటున్నాడట. అంతేకాదు ఆ తరువాత సినిమాగా రూపొందుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలోనూ ఆయన పేరు సాయితేజ్ అనే వుంటుందట. ఇక సాయిధరమ్ తేజ్ లో 'ధరమ్' ను ఆయన పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని చెప్పుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ ఎంతవరకూ కంటిన్యూ అవుతుందో చూడాలి మరి.