ప్రధాని కార్యాలయం దీనిని గమనిస్తుంది జగన్ రెడ్డి గారూ!: పవన్ కల్యాణ్ హెచ్చరిక
- కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికేనా తెలుగు భాష
- తెలుగు కోసం డబ్బు తెచ్చి ఇంగ్లీష్ కోసం ఖర్చు చేస్తారా?
- ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ మండిపాటు
"350 -ఏ... వాడి - అంటే తెలుగు కోసం డబ్బులు తీసుకొని, ఇంగ్లీషు కోసం ఖర్చుపెడతారా? ప్రధాని కార్యాలయం దీన్ని గమనిస్తుంది జగన్ రెడ్డి గారూ" అని పవన్ హెచ్చరించారు. అంతకుముందు "కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు, ఎవరికైనా అదే అనిపిస్తుంది" అని ట్వీట్ చేశారు.