Kamal Haasan: గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల కమలహాసన్ స్పందన

  • కమల్ కు గౌరవ డాక్టరేట్ అందించిన సెంచూరియన్ వర్సిటీ
  • ఒడిశా సీఎం చేతుల మీదుగా డాక్టరేట్ పుచ్చుకున్న కమల్
  • ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు
విలక్షణ నటుడు కమలహాసన్ కు ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ డాక్టరేట్ ను కమల్ కు అందించారు. దీనిపై కమల్ స్పందిస్తూ, మీ అద్భుతమైన ఆతిథ్యానికి, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ఒడిశా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

"ఈ పర్యటన, మీతో సంభాషణలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీ విధానాలను నాకెంతో ఇష్టమైన తమిళనాడులోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తాను. ఒడిశా ఓ అపురూపమైన పెన్నిధి వంటిది. మీ సుహస్తాల్లో అది ఇంకా భద్రంగా ఉంటుందని భావిస్తున్నాం. మీకు, మీ యంత్రాంగానికి నా అభివందనాలు" అంటూ కమల్ ట్వీట్ చేశారు.
Kamal Haasan
Doctorate
Odisha
Naveen Patnaik

More Telugu News