Chandrababu: 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం' వంటి ర్యాలీలు నిర్వహించిన విషయం గుర్తొస్తోంది: చంద్రబాబు

  • బాలికా చైతన్య యాత్రను ప్రారంభించిన చంద్రబాబు
  • ట్విట్టర్ లో స్పందన
  • బాలికల్లో అవగాహన కోసం స్వచ్ఛంద సంస్థల ప్రయత్నం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తణుకులో 'బాలికా చైతన్య యాత్ర'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో తన స్పందన వ్యక్తం చేశారు. ఆరు రోజుల పాటు సుమారు 450 స్కూళ్లలోని 50,000 మంది బాలికలను కలిసి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు బాలికా చైతన్య యాత్ర నిర్వాహకులు చేస్తున్న కృషి, వారి సామాజిక బాధ్యతను చూస్తుంటే టీడీపీ హయాంలో 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం' వంటి చైతన్య ర్యాలీలు నిర్వహించిన విషయం గుర్తుకువస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

సమాజంలో బాలికలపై నానాటికీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో 'ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ' అనే విషయం పట్ల విద్యార్థినుల్లో అవగాహన కలిగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ప్రశంసనీయం అని వివరించారు. ఈ చైతన్య యాత్రలో భాగంగా విజయవాడ నుంచి విశాఖ వరకు 555 కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం అభినందనీయం అని తెలిపారు.
Chandrababu
Vijayawada
Vizag
Andhra Pradesh
Telugudesam

More Telugu News