ఈ నెల 25న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- 25వ తేదీ ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం
- కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న పీఎస్ఎల్వీ
- అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా తీసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ
కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. మరోవైపు, ఇతర 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి కావడం గమనార్హం.