పార్లమెంట్ ముట్టడికి జేఎన్‌యూ విద్యార్థుల పిలుపు.. వర్సిటీలో భారీ బందోబస్తు
- వసతి గృహాలు, మెస్ ధరల పెంపునకు నిరసన
- భారీ ర్యాలీకి ప్రయత్నాలు
- వర్సిటీలో 144 సెక్షన్
భారీ ర్యాలీగా విద్యార్థులు బయలుదేరడంతో పార్లమెంట్ తో పాటు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ వర్సిటీలో 144 సెక్షన్ విధించారు. 1,400 మంది అదనపు బలగాలను అక్కడకు తరలించారు. విద్యార్థులు ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.