'ఎంత మంది పెళ్లాలు? మట్టికొట్టుకుపోతావు' అన్న విమర్శలు అవసరం లేదు: ఉండవల్లి
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారి డ్యూటీలు వారు చేస్తున్నారు
- వారిపై ఇంతలా ప్రతి విమర్శలు చేయొద్దు
- తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తే మంచిదే
'ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో 95 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలో విద్యకు మద్దతు తెలుపుతున్నారు. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తే మంచిదే. అలాగే, ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలి. ఆంగ్ల మాధ్యమంలో విద్యపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పు లేదు' అని తెలిపారు.