Bangladesh: నిలకడగా ఆడుతున్న బంగ్లా ఆటగాళ్లు... భారత బౌలర్లకు పరీక్ష!

  • 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా
  • ఆపై నిలదొక్కుకున్న మిడిల్ ఆర్డర్
  • ప్రస్తుతం స్కోరు 36 ఓవర్లలో 98/3
ఇండోర్ లో ఈ ఉదయం ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత బౌలర్లకు పరీక్ష పెడుతున్నారు. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికుర్ రహీమ్, మోమినుల్ హక్, నిలకడగా ఆడుతూ, మరో వికెట్ పడకుండా ఆటను లంచ్ విరామ సమయానికి తీసుకెళ్లారు.

లంచ్ తరువాత వీరిద్దరూ తమ బ్యాట్ కు పని చెప్పడంతో స్కోర్ బోర్డు వేగంగా కదిలింది. పదునైన బంతులను వదిలేస్తూ, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ, ఫోర్లతో పాటు సిక్స్ లనూ కొట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు కాగా, ముష్ఫికర్ 34 పరుగులతో (నాలుగు ఫోర్లు, ఒక సిక్స్), మొమినుల్ 36 పరుగులతో (ఆరు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మలు చెరోవైపు నుంచి శ్రమిస్తున్నారు.
Bangladesh
India
Cricket
Indore

More Telugu News