sad news: కలుషిత నీరు కారణంగా ఇద్దరు చిన్నారుల మృతి

  • హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో విషాదం
  • కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీటితోనే ప్రమాదం
  • లబోదిబోమంటున్న బాధిత కుటుంబం

మంచినీరు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసింది. కార్పొరేషన్ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న నీరు కలుషితం కావడంతో ఆ నీరు తాగి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం.పహాడీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 


ఆ ప్రాంతానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు కలుషితమవుతోందని స్థానికులు గుర్తించారు. ఈ విషయం పై సంబంధిత అధికారులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోక పోవడంతో నీటి కాలుష్యం ఇద్దరి ప్రాణాలు తీసింది. సమస్య తెలియజేసినా పట్టించుకోని అధికారుల తీరు తమ కడుపుకోతకు కారణమయ్యిందని బాధిత కుటుంబం సభ్యులు మండిపడుతున్నారు.

sad news
two children died
water polution
Hyderabad

More Telugu News