Chandrababu: జగన్ కు ఇంటి దొంగలు కనిపించడం లేదా?: చంద్రబాబు
- ఇసుకను కబ్జా చేస్తూ పెత్తనం చలాయిస్తున్నారు
- పక్క రాష్ట్రాల్లో ఏపీ ఇసుక దొరుకుతుంటే సీఎంకు కనిపించడం లేదా?
- 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితిని తీసుకొచ్చారు
ఇసుకను కబ్జా చేస్తూ వైసీపీ ప్రభుత్వం పెత్తనం చలాయిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఏపీ ఇసుక దొరుకుతుంటే ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇంటి దొంగలు ఆయనకు కనపడరా? అని అడిగారు. రాష్ట్రంలో 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితిని తీసుకొచ్చారని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా భవనాలను నిర్మించే పరిస్థితి లేదని... దీనికి అనుసంధానమై ఉన్న 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పొలంలో మట్టిని తీసుకుపోవాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలని అనడం దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో చంద్రబాబు ఇసుక దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.