బ్లూ ఫ్రాగ్ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు: నారా లోకేశ్
- 'మన శాండ్' వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన బ్లూ ఫ్రాగ్ కంపెనీ
- ఈ కంపెనీతో లోకేశ్ కు సంబంధముందని వదంతులు
- ఈ వదంతులను ఖండించిన లోకేశ్
ఈ సంస్థతో తనకు సంబంధం ఉందని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.