'నిజం' సినిమా నుంచి తప్పుకోవాలని చూశాను: సీనియర్ హీరోయిన్ రాశి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నిజం' సినిమా నుంచి తప్పుకోవాలని చూశాను: సీనియర్ హీరోయిన్ రాశి

  • 'నిజం' కథను అలా చెప్పారు
  • నాది నెగిటివ్ రోల్ అని నాకు ఫస్టు డేనే తెలిసిపోయింది
  • ఇండస్ట్రీలో బ్యాడ్ కాకూడదని చేశానన్న రాశి
తెలుగు తెరపై గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన సీనియర్ కథానాయికలలో రాశి ఒకరు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాశి మాట్లాడుతూ, తేజ దర్శకత్వంలో వచ్చిన 'నిజం' సినిమాను గురించి ప్రస్తావించారు.

"తేజగారు అప్పుడు వరుస హిట్లు ఇస్తున్నారు .. ఆయన కెరియర్ గ్రాఫ్ టాప్ లో వుంది. 'నిజం' సినిమా కోసం మాట్లాడటానికి ఆయన ఆఫీస్ కి రమ్మంటే వెళ్లి కలిశాను. 'మీరు .. గోపీచంద్ ఒక జంటగా కనిపిస్తారు .. మీ మధ్య లవ్ స్టోరీ ఉంటుంది .. మీ మధ్యలోకి ఒక విలన్ వస్తాడు ..' అని పాజిటివ్ గా చెప్పుకొచ్చారు.

షూటింగ్ ఫస్టు రోజునే నాది నెగెటివ్ రోల్ అనే అనుమానం వచ్చింది. షూటింగ్ మానేసి వెళ్లిపోదామని అనుకుంటున్నట్టుగా పీఆర్వోకి చెప్పాను. 'అలా చేయడం వలన ఇండస్ట్రీలో బ్యాడ్ అవుతారు .. ఒప్పుకున్నారు కనుక చేయడమే మంచిది' అని అన్నారు. అన్నయ్య కూడా అదే మాట చెప్పాడు. ఆ పాత్రను చేయడం వలన కొన్ని విమర్శలు ఎదురయ్యాయి .. ప్రశంసించినవాళ్లు కూడా వున్నారు" అని చెప్పుకొచ్చారు.
Rasi
Teja

More Telugu News