ఆంధ్రప్రదేశ్ లో 14 నుంచి ఇసుక వారోత్సవాలు: కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడి
- ఏడురోజుల్లో రోజువారీ సరఫరాను 2 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయం
- ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
- రెండురోజుల్లోగా నియోజకవర్గాల వారీగా రేటు కార్డును నిర్ణయించాలని సూచన
నియోజకవర్గాల వారీగా రేటు కార్డును రెండురోజుల్లోగా నిర్ణయించాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరేవరకు అధికారులు సెలవు తీసుకోరాదని, అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకన్నా ఇసుక ఎక్కువ రేటుకు అమ్మితే వారిపై జరిమానా విధించడంతో పాటు, వాహనాలను సీజ్ చేసి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని అదేశించారు. బుధవారం దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.