శివసేనకు గడువు ముగియడంతో తాజాగా ఎన్సీపీని ఆహ్వానించిన మహారాష్ట్ర గవర్నర్!
- మహారాష్ట్రలో తొలగని అనిశ్చితి
- కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో శివసేన
- తమను గవర్నర్ పిలిచారంటున్న ఎన్సీపీ నేతలు
కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న శివసేన ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. తొలుత మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపిన కాంగ్రెస్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్సీపీతో కూడా చర్చించాల్సి ఉందంటూ కాంగ్రెస్ అధినాయకత్వం శివసేనకు నిరాశ కలిగించే సంకేతాలు పంపింది.