Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేను విరాట్‌ కోహ్లీని' అంటోన్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతురు.. వీడియో వైరల్

  • నా కూతురు ఇండీ.. కోహ్లీలా అవ్వాలనుకుంటోంది: వార్నర్
  • దీనికి మంచి క్యాప్షన్‌ ఇవ్వండని ట్వీట్
  • తమ కూతురు ఎక్కువ సమయం భారత్‌లోనే గడిపిందన్న వార్నర్ భార్య
'నేను విరాట్‌ కోహ్లీని' అంటూ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతురు ఇండీ రే (4) పలికిన పలుకులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన కూతురు ఇంటి వద్ద బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోను వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పోస్ట్‌ చేశాడు. తన కూతురు ఇండీ.. కోహ్లీలా అవ్వాలనుకుంటోందని, దీనికి మంచి క్యాప్షన్‌ ఇవ్వండని ఆయన పేర్కొన్నాడు.

డేవిడ్‌ వార్నర్‌ భార్య కాండిస్‌ వార్నర్‌ కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. తమ కూతురు ఎక్కువ సమయం భారత్‌లోనే గడిపిందని, ఆమె కోహ్లీలా ఆడాలనుకుంటోందని పేర్కొంది. దీనిపై అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆమెను క్రికెటర్ ను చేయాలని, నిజంగానే కోహ్లీలా ఆడుతోందని అంటున్నారు. 
Virat Kohli
Cricket
Australia
India

More Telugu News