జమ్మూకశ్మీర్ లో ఇద్దరు ముష్కరులను కాల్చిచంపిన బలగాలు
- బందిపొర జిల్లాలో ఈ ఉదయం ఎన్ కౌంటర్
- ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల గాలింపు
- ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
ఈ సందర్భంగా భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలర్ట్ అయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల మృత దేహాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.