AP Bhavan: మాజీ ఐఏఎస్ అధికారి పి.ఎస్.కృష్ణన్ మృతి

  • కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కృష్ణన్
  • బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి
  • సామాజిక చైతన్యానికి రచనలు
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఢిల్లీలోని ఏపీ భవన్ మాజీ రెసిడెంట్ కమిషనర్ (ఆర్‌సీ) పీఎస్ కృష్ణన్ ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతికి ఏపీ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏఐఆర్‌డీఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు, ఏపీ భవన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ లింగరాజు తదితరులు సంతాపం తెలిపారు.

ఐఏఎస్ అధికారి అయిన కృష్ణన్  కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కృష్ణన్‌ తన రచనల ద్వారా సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృష్ణన్ ఎనలేని సేవలు అందించారు.

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణన్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం ఆయన మృతి చెందినట్టు అపోలో వైద్యులు తెలిపారు.
AP Bhavan
PS Krishnan
resident commissioner

More Telugu News