Nivedha Thamos: చౌకబారు ప్రశ్నలకు దీటుగా జావాబులిచ్చిన నివేదా థామస్!

  • దక్షిణాది భాషల్లో నటించిన నివేదా
  • ఆన్ లైన్ లో అభిమానులతో ముచ్చట్లు
  • చెత్త ప్రశ్నలు చూసి మండిపాటు
కమలహాసన్ హీరోగా వచ్చిన 'పాపనాశం'తో తెరంగేట్రం చేసి, ఆపై అన్ని దక్షిణాది భాషల్లో నటించిన నివేదా థామస్, తాజాగా, అభిమానులతో ఆన్ లైన్లో ముచ్చటిస్తున్న వేళ, తనకు ఎదురైన చెత్త ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చింది. చాలా చెత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఓపిక పట్టిన నివేదా, నువ్వు కన్యవేనా? ప్రేమలో పడ్డావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? వంటి ప్రశ్నలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

తనతో మాట్లాడేందుకు టైమ్ కేటాయించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూనే, కొందరి ప్రశ్నలకు బదులివ్వాలంటే జాలిగా అనిపించిందని, వారంతా ఓ సహ మనిషితో మాట్లాడుతున్నానని గుర్తించాలని చురకలిచ్చింది. కొంచెం మర్యాద ఇవ్వాలని, ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోవాలని సూచించింది. ఇక హీరోయిన్లపై చౌకబారు ప్రశ్నలు అడిగేవారికి నివేదా మంచి సమాధానమే ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
Nivedha Thamos
Twitter
Vergin

More Telugu News