Maharashtra: మా వల్ల కాదు... మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో చేతులెత్తేసిన బీజేపీ

  • మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్
  • ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి ఆహ్వానం పలికిన గవర్నర్
  • సంఖ్యాబలం లేదంటూ వెనక్కి తగ్గిన బీజేపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించినా, తమ వల్ల కాదంటూ బీజేపీ అశక్తత వ్యక్తం చేసింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ తమకు లేదని, ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన కూడా సహకరించడంలేదని బీజేపీ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీకి తెలియజేసింది. అంతకుముందు, గవర్నర్ ఆహ్వానంపై దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సమావేశమై చర్చించారు. అనంతరం తమకు సంఖ్యాబలం లోపించినందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నామని పాటిల్ ప్రకటించారు.
Maharashtra
BJP

More Telugu News