Nara Lokesh: లోకేశ్ గెలిస్తే మీ ఇళ్లు తొలగిస్తాడు అని చెప్పి ఇప్పుడు మీరేం చేస్తున్నారు?: నారా లోకేశ్

  • జీవితాలే లేకుండా చేస్తున్నారని ఆగ్రహం
  • యానిమేటర్ల సమస్యలపై లోకేశ్ స్పందన
  • ఒక్కరి ఉద్యోగం పోయినా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు మంగళగిరిలో లోకేశ్ గెలిస్తే మీ ఇళ్లు తొలగిస్తాడు అని ఓ నాయకుడు దుష్ప్రచారం చేశాడని, ఇప్పుడు మంగళగిరిలో జీవితాలే లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలో వెలుగు పథకం యానిమేటర్లు రేయింబవళ్లు అలుపెరుగని పోరాటం చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడని లోకేశ్ విమర్శించారు. 27,700 మంది యానిమేటర్లలో ఒక్కరి ఉద్యోగం పోయినా వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. "మా అక్కచెల్లెళ్లకు నేను అండగా నిలుస్తాను. వైసీపీ వలంటీర్ల పేరుతో సంవత్సరానికి రూ.4000 కోట్ల దోపిడీ చేస్తున్నారు. అయినాగానీ మీ ధనదాహం తీరడం లేదా జగన్ గారూ?" అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
Nara Lokesh
Telugudesam
YSRCP
Mangalagiri

More Telugu News