BulBul cyclone: తీరం దాటిన ‘బుల్‌బుల్’.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

  • గత రాత్రి బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన తుపాను
  • తీరంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • ఏపీలో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం
భయపెట్టిన బుల్‌బుల్ తుపాను తీరం దాటింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుపాను గత రాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటినట్టు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇక, తుపాను ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
BulBul cyclone
Bay of Bengal
West Bengal
Andhra Pradesh

More Telugu News