అయోధ్య తీర్పుపై జగద్గురు స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు
- సుప్రీం కోర్టు తీర్పు సంతోషం కలిగించిందని వెల్లడి
- రామమందిరం నిర్మించడానికి ట్రస్ట్ ఇప్పటికే ఉందన్న స్వరూపానంద
- అంగ్‌కోర్ వాట్ దేవాలయం తరహాలో రామ మందిరం నిర్మించాలని అభిలాష
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశంపై స్వామి స్పందిస్తూ.. గతంలో పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని చెప్పారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.