Ayodya decision: తీర్పు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా ఇచ్చింది కాదు: శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ఠాక్రే

  • బీజేపీ ఇదేదో తన ఘనతగా చెప్పుకోకూడదు
  • అలాగైతే న్యాయస్థానం ట్రస్టు ఏర్పాటు చేయమని ఎందుకు కోరుతుంది
  • రామమందిర నిర్మాణానికి చట్టం చేయాలని ఎప్పడో మేం చెప్పాం
అయోధ్యలో వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ అదేదో తమ ఘనతగా భారతీయ జనతా పార్టీ చంకలు గుద్దుకోనవసరం లేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. కేంద్రంపై పూర్తిస్థాయి విశ్వాసం కోర్టుకు ఉండి ఉంటే ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుచేసి స్థలాన్ని దానికి అప్పగించాలని ఎందుకు కోరుతుందని ప్రశ్నించారు.

రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని ఎప్పుడో తాము కోరామని, కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక ట్రస్టుకే అప్పగించిందని గుర్తు చేశారు. అందువల్ల తీర్పు తమ ఘనతగా బీజేపీ చెప్పుకోరాదన్నారు. మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటు విషయమై రెండు పార్టీల మధ్య నెలకొన్న ప్రతిష్టంబన నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు.
Ayodya decision
sivasena
udhav thakare
BJP

More Telugu News