Mammootty: మమ్ముట్టి మూవీ నుంచి ఆసక్తిని రేపుతున్న ట్రైలర్

  • మమ్ముట్టి నుంచి భారీ చారిత్రక చిత్రం
  • మలయాళ .. తెలుగు భాషల్లో విడుదల 
  • ముఖ్యమైన పాత్రలో ఉన్నిముకుందన్
మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న మమ్ముట్టిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. విజయవంతమైన ఎన్నో వైవిధ్యభరితమైన కథా చిత్రాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. తాజాగా ఆయన విభిన్నమైన కథాంశంతో కూడిన చిత్రంలో నటించారు. 'మామాంగం' అనే టైటిల్ తో మలయాళంలో రూపొందిన ఈ సినిమా, అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను ఈ నెల 21వ తేదీన పలకరించనుంది.

ఉన్నిముకుందన్ .. ప్రాచీ తెహ్లాన్ .. అను సితార ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. ఆసక్తికరమైన సన్నివేశాలపై  కట్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. చారిత్రక నేపథ్యంలో .. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Mammootty
Unni Mukundan
prachi
Anu

More Telugu News