mumbai: మన ముందు యముడు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది?.. రైల్వే ట్రాక్‌పై అవగాహనలో వినూత్న ప్రయత్నం

  • రైల్వే స్టేషన్ లో పశ్చిమ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వినూత్న ప్రయత్నం 
  • రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారికి అవగాహన
  • యముడు భుజంపై వేసుకొని నరకానికి తీసుకెళ్తున్నట్లు ప్రదర్శన
మన ముందు యముడు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? మహారాష్ట్రలో ఈ అనుభవాన్నే ఎదుర్కొన్నారు కొందరు వ్యక్తులు. దేశ వ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌లతో పాటు రైల్వే ట్రాక్‌ల వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతోన్న నేపథ్యంలో వీటిపై అవగాహన కల్పించడానికి ముంబయి రైల్వే స్టేషన్ లో పశ్చిమ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వినూత్న ప్రయత్నం చేసింది. యముడి వేషధారణలో రైల్వే స్టేషన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారిని భుజంపై వేసుకొని నరకానికి తీసుకెళ్తున్నట్లు నటించాడు.
    రైల్వే శాఖ సూచించే నిబంధనలు పాటించకపోతే యమలోకానికి వెళతారంటూ యమ ధర్మరాజు వేషధారణలోని వ్యక్తి ఇలా హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేసిన వినూత్న ప్రయోగంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
     
mumbai
Maharashtra
railway

More Telugu News