వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చే లోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: లోకేశ్
- ఇసుక కొరత అంశంపై లోకేశ్ వ్యాఖ్యలు
- జగన్ పై ట్విట్టర్ లో విమర్శలు
- ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్
"భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ శవరాజకీయాలకు పాల్పడుతోందని జగన్ అనడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్టుగా ఉంది. శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ మీరే జగన్ గారూ, ఆ విషయం మీరు మర్చిపోయినట్టుంది. ఆత్మహత్యలను అపహాస్యం చేయడం ఇప్పటికైనా మానండి" అంటూ హితవు పలికారు.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.