ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం స్పందిస్తుంది: నిజామాబాద్ ఎంపీ అరవింద్
- ఆర్టీసీ సమ్మెపై నిజామాబాద్ ఎంపీ స్పందన
- కేంద్ర చట్టాన్ని కేసీఆర్ ఉపయోగించుకోలేకపోతున్నాడని విమర్శ
- తన అసమర్థతను కేంద్రంపై నెడుతున్నాడని ఆరోపణ
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఆర్టీసీ కార్మికులకు ఉందని, కార్మికుల సమ్మెపై కేంద్రం స్పందిస్తుందని తెలిపారు. కేంద్ర చట్టాన్ని కేసీఆర్ చదవకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు రోజు ఆయన ఇదే అంశంపై స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికిల్ చట్టంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఎక్కడా లేదని అన్నారు.