విజయారెడ్డి కేసు నిందితుడి బంధువుల వద్ద భూములు కొన్నవారే నాపై ఆరోపణలు చేస్తున్నారు: ఎమ్మెల్యే మంచిరెడ్డి

  • చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆరోపణలు చేస్తున్నారు
  • ఎవరి పేరు మీద భూమి ఉందన్న విషయాలపై విచారణ చేపట్టాలి
  • నిజాలు తేలుతాయి 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణంగా హత్యకు గురి కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితుడి బంధువుల వద్ద భూములు కొనుగోలు చేసినవారు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.

ఈ రోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ భూ వివాదానికి కారణమైన 412 ఎకరాల భూమి సర్వే నంబర్లు, ఎవరి పేరు మీద భూమి ఉంది అన్న విషయాలపై విచారణ చేపట్టాలని, నిజాలు తేలుతాయని ఆయన అన్నారు.

ఏడాదిన్నర క్రితం 60 కుటుంబాలు తన వద్దకు వచ్చి, సమస్యలు చెప్పుకున్నాయని, దీంతో వారందరినీ జేసీ వద్దకు తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరానని అన్నారు. ఈ భూవ్యవహారంపై  విచారణ కోసం తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్, డీజీపీలకు లేఖ రాస్తానన్నారు.  
Go Back to Shorts
manchireddy
TRS
Telangana

More Telugu News