MS Dhoni: కామెంటరీ బాక్సులోకి రానున్న ఎంఎస్ ధోనీ!

  • ఈడెన్ గార్డెన్స్ లో కామెంటేటర్ గా ధోనీ
  • నవంబరు 22న భారత్, బంగ్లాదేశ్ మధ్య చారిత్రక డేనైట్ టెస్టు
  • మాజీ కెప్టెన్లతో కామెంటరీ చెప్పించాలని స్టార్ ఇండియా ప్రణాళిక
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత క్రికెట్ కు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కామెంటేటర్ గా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో ధోనీ కామెంటేటర్ గా వ్యవహరించనున్నాడు. నవంబరు 22న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఈ టెస్టును డే అండ్ నైట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మ్యాచ్ ప్రసారకర్త స్టార్ ఇండియా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ కామెంటరీ బాక్స్ ను భారత మాజీ కెప్టెన్లతో నింపేయాలని నిర్ణయించింది. ధోనీ సహా మాజీ టెస్టు సారథులందరూ ఈ టెస్టులో తొలి రెండ్రోజులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. అంతేకాదు, చివరి రెండ్రోజులు ఆట విరామ సమయాల్లో వీరంతా మైదానంలో క్రికెట్ ఆడతారు.
MS Dhoni
Commentator
India
Bangladesh
Day And Night Test
Kolkata
Eden Gardens

More Telugu News