Telangana: విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికుల జాయినింగ్ రిపోర్ట్ సమర్పణకు పలు ఆప్షన్లు

  • ఆర్టీసీ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయడానికి వీలు
  • జాబితాలో ఆయా జిల్లాల కలెక్టరేట్ లు
  • అదనంగా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాలు కూడా..
తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటి అర్ధ రాత్రి ముగియనున్న నేపథ్యంలో కార్మికులు తమ జాయినింగ్ రిపోర్ట్ లు సమర్పించేందుకు పలు కార్యాలయాల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడించారు. విధుల్లో చేరడానికి సిద్ధమైన కార్మికులు ఆయా డిపో మేనేజర్లకే కాకుండా, డీవీఎం కార్యాలయాలు  లేదా ఆర్ ఎం కార్యాలయాలతోపాటు, ఆయా జిల్లాల కలెక్టరేట్ లు, ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల్లో కూడా తమ జాయినింగ్ పత్రాలను సమర్పించవచ్చన్నారు.

Telangana
Labourers strike
Rtc
joining report

More Telugu News