Pawan Kalyan: ఇప్పటికీ చిరంజీవి పేరే చెప్పుకుంటా, మీరు ఏనాడైనా చిరంజీవి పేరు చెప్పారా?: పవన్ ను నిలదీసిన కన్నబాబు

  • పవన్, కన్నబాబు మధ్య మాటలయుద్ధం
  • లాంగ్ మార్చ్ లో కన్నబాబుపై పవన్ వ్యాఖ్యలు
  • ఘాటుగా బదులిచ్చిన ఏపీ మంత్రి
ఏపీ మంత్రి కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్ నే టార్గెట్ చేసి మాట్లాడడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప మరో నాయకుడు పవన్ కు కనపడడంలేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికం లేదని, చిరంజీవి గారి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని నేటికీ చెబుతానని, కానీ పవన్ కల్యాణ్ ఏనాడైనా చిరంజీవి గారి పేరు చెప్పారా? అని నిలదీశారు. కాగా, నిన్న విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ, కన్నబాబు బతుకు తమకు తెలియంది కాదని, కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చింది తామేనని అన్నారు.
Pawan Kalyan
Chiranjeevi
Kannababu

More Telugu News