Srimukhi: శ్రీముఖిపై తన అభిప్రాయాలు పంచుకున్న రాహుల్ సిప్లిగంజ్ తల్లి

  • బిగ్ బాస్-3లో రన్నరప్ గా సరిపెట్టుకున్న శ్రీముఖి
  • తనకు శ్రీముఖి అంటేనే ఇష్టమన్న రాహుల్ తల్లి సుధారాణి
  • శ్రీముఖి ఏదిచేసినా అందంగా ఉంటుందని కితాబు
మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన బిగ్ బాస్-3 రియాల్టీ షో ముగిసింది. ఈ షోలో టాలీవుడ్ యువ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ తల్లి సుధారాణి మీడియాతో మాట్లాడుతూ, చివరివరకు టైటిల్ రేసులో నిలిచిన శ్రీముఖి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ టైటిల్ కోసం రాహుల్, శ్రీముఖి మధ్య గట్టి పోటీ నెలకొందని, కానీ రాహుల్ మాటల్లో నిజాయతీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారని సుధారాణి అభిప్రాయపడ్డారు. శ్రీముఖి సైతం గట్టిగా పోరాడిందని ప్రశంసించారు. తనకు బిగ్ బాస్-3 కంటెస్టెంట్లందరిలో శ్రీముఖి అంటేనే బాగా ఇష్టమని వెల్లడించారు. ఆమె ఏంచేసినా అందంగా ఉంటుందని, ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటుందని తెలిపారు.
Srimukhi
Rahul Sipligunj
Sudha Rani
Bigg Boss-3

More Telugu News