Chandrababu: 14న విజయవాడలో చంద్రబాబు దీక్ష!

  • జగన్ పాలనకు వ్యతిరేకంగా దీక్ష
  • ఒకరోజు దీక్షకు చంద్రబాబు నిర్ణయం
  • అదే రోజు జిల్లా కేంద్రాల్లో నేతల దీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అరాచక పాలనకు వ్యతిరేకంగా తాను ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్టు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన విజయవాడ వేదికగా దీక్ష జరుగుతుందని, తాను ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్షలో కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన ఆయన, ఇసుక వ్యవహారం, టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, ప్రతిభా పురస్కారాలకు పేర్ల మార్పు, సీఎస్ బదిలీ తదితర అంశాలపై చర్చించారు. తన దీక్ష ఆలోచనను పార్టీ నేతలకు వెల్లడించిన చంద్రబాబు, అదే రోజు జిల్లా కేంద్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు దీక్షలు చేయాలని సూచించారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
Protest

More Telugu News