Suresh: విజయారెడ్డిని సజీవదహనం చేసిన సురేశ్ పరిస్థితి అత్యంత విషమం!

  • విజయారెడ్డికి నిప్పంటించిన సురేశ్
  • ప్రమాదంలో తీవ్ర గాయాలు
  • మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలింపు
నిన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయా రెడ్డిని దారుణంగా సజీవ దహనం చేసిన కూర సురేశ్, ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనలో సురేశ్ కు సైతం తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. శరీరంపై దాదాపు 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన సురేశ్, ఇప్పుడు కోమాలోకి వెళ్లడంతో, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో రెండు రోజుల తరువాతనే సురేశ్ ఆరోగ్యంపై ఓ అంచనాకు రావచ్చని తెలిపారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా సురేశ్ ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.
Suresh
Vijayareddy
Fire
Burns
Osmania

More Telugu News