మీరు కలగజేసుకోవాలి: ఆరెస్సెస్ చీఫ్ కు శివసేన లేఖ
- బీజేపీ-శివసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారు
- కూటమి ధర్మాన్ని బీజేపీ విస్మరించింది
- మీరు కలగజేసుకుని సమస్యకు ముగింపు పలకండి
ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారని... కానీ కూటమి ధర్మాన్ని పాటించడంలో బీజేపీ విఫలమైందని లేఖలో కిశోర్ తివారీ ఆరోపించారు. బీజేపీ తీరుతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఆరెస్సెస్ కలగజేసుకుని సమస్యకు ముగింపు పలకాలని కోరారు. అయితే, కిశోర్ తివారీ లేఖపై ఆరెస్సెస్ ఇంతవరకు స్పందించలేదు.