LV Subrahmanyam: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆకస్మిక బదిలీ వేటు

  • ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్
  • మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
  • సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసింది. ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించింది. మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు. తక్షణమే విధుల నుంచి తప్పుకుని, నీరబ్ కుమార్ కు బాధ్యతలను అప్పగించాలని సుబ్రహ్మణ్యంకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఆయనను బదిలీ చేయడం గమనార్హం.
LV Subrahmanyam
Trasfer
Andhra Pradesh
Chief Secretery

More Telugu News